సీఎం సంతకం చేయించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం, శలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడికి, ఉద్యోగంలో చేరడంలో 4 సంవత్సరాలు ఆలస్యమైంది. తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద వచ్చిన ఉద్యోగానికి తల్లి అనారోగ్యం కారణంగా చేరలేకపోయాడు. ఈ ఆలస్యం వల్ల సీఎం సంతకం అవసరమైంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ చొరవతో సీఎం సంతకం లభించింది. దీంతో నిఖిల్ కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత పోస్ట్