ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం క్విస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. ఎమ్మెస్సీ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, సీఎస్ఈ విభాగాధిపతి బుచ్చిబాబు, హెచ్ఎర్ జయలక్ష్మి, డా. వాసు, డా. ఇమ్రాన్, డా. రమణ, డా. ఇర్ఫాన్, ఏఎన్యీూ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ ఎంపికల్లో పాల్గొన్నారు. ప్లేస్‌మెంట్లో పాల్గొన్న వారికి రెండు రోజుల్లో నియామకపత్రాలు అందిస్తామని క్విస్ యాజమాన్యం ప్రకటించింది.