ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ వర్క్‌షాప్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ లింగరాజు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందని, విద్యార్థులు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.