తెనాలి మండలం హాఫ్‌పేట గ్రామంలో ఈ నెల 9న పట్ట పగలు జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన బండి గోపి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. సర్వే పేరుతో ఇంట్లోకి వెళ్లి రూ.25 వేల నగదు చోరీ చేసినట్లు వెల్లడించారు. ఘటనలో ఉపయోగించిన కారు నంబర్ ఆధారంగా నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.