పొన్నూరు: ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా అరుణ్ కుమార్

గుంటూరు జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ విభాగం కార్యదర్శిగా తక్కెళ్ళపాడుకు చెందిన అరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు అరుణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంపై పలువురు శ్రేణులు అరుణ్ కుమార్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్