గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు సోమవారం రాత్రి విధులు ముగించుకొని స్వగ్రామం గుంటూరు వెళుతుండగా నారాకోడూరు ప్రధాన రహదారిలో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రిందపడ్డాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేబ్రోలు పోలీసులు గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.