గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో గురువారం నమస్తే కార్యక్రమంలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కు కేంద్ర ప్రభుత్వ అధికారుల చే అవగాహన సదస్సు జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లను శుబ్రం చేసే వాళ్ళు ఎంత పరిశుబ్రంగా ఉండాలో, సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చు విషపూరితమైన వాయువులను పీల్చడం వల్ల కలుగు నష్టాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.