పెదకాకాని మండలం గోళ్ళమూడి గ్రామంలో శుక్రవారం "బాబు షూరిటీ- మోసం గ్యారంటీ" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దాడులను గ్రామ ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.