పొన్నూరు అభివృద్ధి ఎమ్మెల్యే ధూళిపాళ్లతోనే సాధ్యం

పొన్నూరు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల సమక్షంలోనే సాధ్యమని తెదేపా నాయకులు గురువారం పేర్కొన్నారు. సీఆర్డీఏ నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేయించి పలు వార్డుల్లో రోడ్లు, సైడు కాలువల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు గుర్తు చేశారు. వైకాపా నాయకుల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, అందుకే నియోజకవర్గంలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో తెదేపా పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్