పొన్నూరు: చేబ్రోలులో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

చేబ్రోలు గ్రామం కొత్తపేట ప్రాధమిక పాఠశాల భవిత సెంటర్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓలు చలపతిరావు, ఆర్ సుబ్బారావు మాట్లాడుతూ, దివ్యాంగులలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని జి. అనురాధ, ఫిజియోథెరపీ వైద్యురాలు గాలి ప్రియదర్శిని, తల్లితండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్