పొన్నూరు: ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధులు నివారణ డీఎంవో

జాతీయ డెంగ్యూ మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం పొన్నూరు పట్టణంలో మలేరియా యూనిట్, శ్రావ్య నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయనమ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వలన దోమలు నివారించవచ్చన్నారు. దోమ కాటు వలన వచ్చే వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ ఎం ఓ ప్రభాకర్, రెడ్డి డాక్టర్ అలేఖ్య, ఎస్సీఓ వెంకట్రామయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్