పొన్నూరు: ఇంజినీరింగ్ ఒన్‌టైమ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఒన్‌టైమ్ పరీక్షల షెడ్యూల్‌ను సీఈ ఆలపాటి శివప్రసాద్ బుధవారం విడుదల చేశారు. 2010 నుంచి సబ్జెక్టులు మిగిలి ఉన్న బీటెక్, ఎంటెక్, ఫార్మాడీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 26లోపు రూ. 6 వేల ఫీజు చెల్లించాలని తెలిపారు. గడువు తర్వాత రూ. 500 అపరాధ రుసుముతో ఫీజు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పర్సనల్ అప్పియరెన్స్ కింద రూ. 2, 420 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షలు జులై 13 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్