పొన్నూరు: రైతన్న మీకోసం పై అవగాహన కార్యక్రమం

పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో బుధవారం 'రైతన్న మీకోసం' వారోత్సవాల్లో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎం ఎల్ ఎన్ రావు, లాం శాస్త్రవేత్త మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు, అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కూటమి ప్రభుత్వం వ్యవసాయంలో అనుసరించనున్న ఐదు కార్యాచరణ విధానాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై వివరణాత్మకంగా తెలియజేశారు. వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్