పెదకాకాని గ్రామం లూధర్ గిరి కాలనీలో గత ఏడాది ప్రహరీ గోడ కూలి బంగారు సిద్దార్ధ (12), కోలాటపు సాత్విక్ (12) ఇద్దరు చిన్నారులు అక్కడక్కడే మరణించారు. ఆదివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సిద్దార్ధ తల్లి జ్యోతి , కోలాటపు సాత్విక్ తల్లి రత్నకుమారి ఒక్కొక్కరికి రూ. 2 లక్ష చొప్పున చెక్కులను అందించారు. రెండు కుటుంబాల వారు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.