పొన్నూరు: జిల్లాబిజెపి ఓబీసీ మోర్చ కార్యదర్శిగా గుంజేరుపల్లి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడి గ్రామానికి చెందిన గుoజేరుపల్లి సాంబశివరావును భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శనివారం జిల్లా అధ్యక్షుడు తురకా రామారావు నియమించారు. నియామక పత్రం అందుకున్న అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బిజెపిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్