పొన్నూరు: రేషన్ బియ్యం తరలిస్తున్న మినీ లారీ పట్టివేత

శుక్రవారం పొన్నూరు రోడ్ లోని బైపాస్ వద్ద 80 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని గుంటూరు సిఎస్డిటి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక్కో బస్తా 50 కేజీల చొప్పున మొత్తం 40 క్వింటాళ్ళ బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. శుద్ధపల్లి డొంకకు చెందిన డి. నరేంద్ర, శ్యాం ప్రసాద్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గుంటూరు ఈస్ట్ సి ఎస్ డి టి ని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్