గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని పెదకాకాని మండలానికి చెందిన నలుగురు అనారోగ్య బాధితులకు ఆదివారం పెదకాకాని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ధూళిపాళ్ల మాట్లాడుతూ సీఎం సహాయనిధి చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ధూళిపాళ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.