పొన్నూరు: నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే

పొన్నూరు మండలంలోని వల్లభరావు పాలెం గ్రామానికి చెందిన డయాలసిస్ రోగి డక్కుమళ్ళ సాయి చరణ్‌కు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రూ. 10 వేల పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెజెండ్ల ఏకాంబరేశ్వర్ రావు, బొద్దులూరి వెంకటేశ్వరరావు, మదమంచి వీరయ్య చౌదరి, బోడి సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్