పొన్నూరు: వాకర్స్ కు మౌలిక వసతులు కల్పించాలి ఎమ్మెల్యే

పొన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని వాకర్స్ గ్రౌండ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. గ్రౌండ్లో మౌలిక వసతుల కల్పనపై కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం డివిసి ఇండోర్ స్టేడియంను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్