శ్రావణ మాస రెండవ శుక్రవారం సందర్భంగా పొన్నూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. 108 కేజీల పసుపుతో అభిషేక జరిగింది. సంకల్ప పూజ, లలిత సహస్ర నామ పారాయణం, సౌందర్య లహరి, శివానందలహరి, మహిళా భక్తులు పారాయణం చేశారు. నీరాజన మంత్ర పుష్ప, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.