గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు ప్రాంతం లోని టిట్కో గృహాల ప్రజలు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు, అర్బన్ సీఐ వీరనాయక్ కు బుధవారం పలు ఫిర్యాదు చేశారు. గృహాల మధ్యన కొందరు మద్యం సేవిస్తున్నారని రాత్రి సమయాలలో తాము భయాందోళనకు గురవుతున్నావని తెలిపారు. అలానే గృహాలలో త్రాగునీరు, డ్రైనేజీ మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.