నూతన సంవత్సరం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీ కలకలం సృష్టించింది. 'ఒక్కొక్కడికి... సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తాం. ఎవరినీ విడిచిపెట్టేదు లేదు...' అనే హెచ్చరికతో కూడిన ప్లెక్సీని మాజీ సీఎం చిత్రపటంతో పాటు ముద్రించారు. ఈ విషయం పొన్నూరు గ్రామీణ ఎస్సై శ్రీహరి దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని ప్లెక్సీని తొలగించి, దానిని ఏర్పాటు చేసిన ముగ్గురు వ్యక్తుల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.