ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శ్రీనివాస్ (కేకే) ను ప్రభుత్వం నియమించిన సందర్భంగా, సోమవారం పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాశెట్టి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, ఏపీ లైవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మేకల రామయ్య, నియోజకవర్గ స్పోక్ పర్సన్ వల్లంశెట్టి శ్రీధర్ ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.