పొన్నూరు: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు

సంక్రాంతి పండుగ సందర్భంగా పొన్నూరులోని సుజాత కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడల వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు అధ్యక్ష కార్యదర్శులు నవదీప్, అన్సారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్