పొన్నూరు జీబీసీ రోడ్డులో తంసప్ ఆటో బోల్తా

గుంటూరు జిల్లా పొన్నూరు శివారు జి బి సి రోడ్డు కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద సోమవారం సాయంత్రం తంసప్ లోడుతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు ఎదుటి వాహనం తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. తంసప్ కంపెనీ వారు వెంటనే ముఠా కూలీలను పిలిపించి రోడ్డుపై ఉన్న తంసప్ బాటిళ్లను తొలగించారు. అర్ధ గంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం జరిగింది.

సంబంధిత పోస్ట్