భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపుమేరకు గురువారం పెదకాకాని గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు ముప్పాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను గత వైసిపి ప్రభుత్వం జీవో నెంబర్ 1214 ను ప్రవేశపెట్టి బోర్డులో ఉన్న 1200 కోట్లను దారి మళ్ళించిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును పునరుద్దించాలని డిమాండ్ చేశారు.