పొన్నూరు: వైయస్ జగన్ మళ్లీ సీఎం కావాలి అంబటి మురళీకృష్ణ

పొన్నూరు పట్టణం ఇటికంపాడు రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని, కేక్ కట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, అందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్