పొన్నూరు మండల విద్యాశాఖ అధికారి (FAC) గా డి రాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజు ఎంఈఓగా ప్రమోషన్ పొంది పొన్నూరు బదిలీపై వచ్చారు. పొన్నూరు మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజు తెలిపారు. నూతన ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన రాజును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.