చేబ్రోలులో రూ. 3. 98 లక్షల ఎరువులు సీజ్

చేబ్రోలు, నారాకోడూరు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల ఏవో పి. ప్రియదర్శిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో చేబ్రోలులోని రెండు దుకాణాలలో సరైన అనుమతి పత్రాలు చూపని 169.95 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 3,98,700 ఉంటుందని తెలిపారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్