పొన్నూరు తాగునీటి పనులకు రూ. కోటి నిధులు మంజూరు

పొన్నూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ. కోటి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఈ పనులకు పరిపాలనా అనుమతులు లభించాయని ఆయన వెల్లడించారు. చెబ్రోలు, దేవరాయబొట్లపాలెం, పెదకాకానిలకు రూ. 25 లక్షల చొప్పున, నంబూరు, వెనిగండ్లకు రూ. 10 లక్షల చొప్పున, తక్కెళ్లపాడుకు రూ. 5 లక్షలు కేటాయించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్