పెదకాకాని మండల టీడీపీ కార్యాలయంలో ఆదివారం, 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం మొయిన్ సెంటర్ వద్ద అన్నగారి విగ్రహం వద్ద జెండా ఎగురవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పెదకాకాని టీడీపీ మండల అధ్యక్షుడు వాలివేటి మురళీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.