పొన్నూరు మండలంలో రీ సర్వే ప్రారంభం తహసిల్దార్

అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూముల రీ సర్వేను ప్రారంభించింది. పొన్నూరు మండలంలో కొండముది, ములుకుదురు, జడవల్లి, జూపూడి, మునిపల్లె, వెల్లలూరు గ్రామాలలో నాల్గవ విడతగా శుక్రవారం రీ సర్వే మొదలైంది. డిసెంబర్ 30న గ్రామ సభలు నిర్వహించి, రీ సర్వే వివరాలను రైతులతో చర్చించినట్లు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్