పొన్నూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ఇది రెండవ వార్షికోత్సవం అని విమర్శించారు. శుక్రవారం 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.