పొన్నూరులో బార్ లైసెన్స్‌ మంజూరుకు నోటిఫికేషన్

పట్టణ మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న ఒక బార్ లైసెన్స్ మంజూరుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 4వ తేదీలోపు తమ దరఖాస్తులను స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు. కనీసం నలుగురు దరఖాస్తుదారులు ఉంటేనే బహిరంగ వేలం నిర్వహిస్తామని, పారదర్శక పద్ధతిలో లైసెన్స్ కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. మద్యం వ్యాపార నిర్వహణకు ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్