గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పాలపర్రు - పెదనందిపాడు గ్రామాల సరిహద్దుల్లో బుధవారం ఎన్ఎన్బి కోల్డ్ స్టోరేజి దగ్గర ఏపీ 04బిఎక్స్3699 నంబర్ గల కారు అతివేగంగా వెళుతూ మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువతీ యువకులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. స్థానికులు వారిని సురక్షితంగా బయటికి తీశారు.