ఎరువుల డీలర్లకు ఏడీఏ హెచ్చరిక: నిబంధనలు పాటించకపోతే చర్యలు

గుంటూరులోని ప్రత్తిపాడు మండల వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ఎరువుల డీలర్లతో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లైసెన్స్, స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి విక్రయాన్ని ఈ-పాస్ ద్వారా జరిపి రైతులకు బిల్లు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల డీలర్లు పాల్గొన్నారు. ఎరువుల డీలర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏడీఏ సూచించారు.

సంబంధిత పోస్ట్