ఏపీ ఎడ్‌సెట్‌లో బొల్లాపల్లి విద్యార్థి సరికొత్త రికార్డు

మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన ఆర్. అను సాత్విక్ ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకు సాధించాడు. సోషల్ విభాగంలో నిర్వహించిన పరీక్షలో 150 మార్కులకు గాను 110 మార్కులు సాధించి ఈ ఘనత అందుకున్నాడు. పట్టుదలతో సాధన చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని సాత్విక్ తెలిపారు. అతని విజయంపై ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్