కాకుమాను మండలంలో నమోదైన నగదు దుర్వినియోగం కేసులో రొంపిచర్ల డీఆర్‌డీఏ ఏపీఎం సోమశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొన్నూరు కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో, సోమశేఖర్ పలుమార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కాకుమాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. కేసు విచారణ కొనసాగుతోంది.