అమరావతిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఉద్దండరాయునిపాలెంలో 0.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా, తాజాగా ఎంఓయూ కుదిరింది. ఈ కార్యాలయం ఏర్పాటుతో అమరావతిలో 500కి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్యాంకు విజయవాడ రీజనల్ హెడ్ ఈ. వెంకటేశ్వరరావు, ఎన్బీసీసీ జీఎం రాజారావు పత్రాలను అందజేశారు.