శనివారం రాత్రి పెదనందిపాడు కూటమి నాయకులు, తెదేపా గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని గ్రామంలోని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం అంబటి రాంబాబు చిత్రపటాన్ని దహనం చేశారు.