సీఎం చంద్రబాబును కలిసిన సహా విద్యార్థి కొమ్మినేని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన సహవిద్యార్ధి కొమ్మినేని ప్రసాద్ సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు తన స్నేహితుడిని ఆప్యాయంగా పలకరించి, చదువుకున్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలంలోని జడ్పీ పాఠశాల అభివృద్ధి, త్రాగునీటి సమస్య, గుంటూరు ఛానల్ పొడిగింపు వంటి పలు సమస్యలను ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలపై చంద్రబాబు స్పందించినట్లు ప్రసాద్ మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్