జమైక డాక్టర్ ను సత్కరించిన సినీదర్శకుడు దిలీప్ రాజా

జమైకా దేశంలో వైద్యవృత్తిలో రాణిస్తున్న డాక్టర్ చందోలు నాగమల్లేశ్వరరావును పట్టుదలకు పరాకాష్టగా పరిగణించాలని 'మా-ఎపి' వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా అన్నారు. గురువారం పెదలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బెల్లంవారిపాలెం గ్రామoలో జన్మించిన డాక్టర్ చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశ ప్రభుత్వం ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం రేపల్లె నియోజకవర్గానికే గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్