కాకుమాను రూరల్ గోడౌన్లో శనివారం పొగాకు కొనుగోలు ధరలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొదటి రకం నల్లబర్లీ చెక్కు రూ. 110, రెండో రకం రూ. 95, మూడో రకం రూ. 80 వరకు మాత్రమే లభిస్తున్నాయని రైతులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధరలు గణనీయంగా పడిపోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.