క్యాన్సర్ బాధితురాలికి ఎమ్మెల్యే మాలకొండయ్య అండ

చీరాల పట్టణ 29వ వార్డు హరి ప్రసాద్ నగర్‌కు చెందిన రావూరి శివనాగేశ్వరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు టీడీపీ ఇంచార్జ్ వల్లెపు వేణుబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బాధితురాలిని బుధవారం పరామర్శించి, సీఎం సహాయ నిధి కింద రూ. 7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే బాధితురాలికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్