ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొని, పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. 2026 నుండి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి కూటమినేతలు పాల్గొన్నారు.