గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో నియోజకవర్గ ఇంచార్జి బలసాని కిరణ్ కుమార్ పాల్గొని, కేకు కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.