ప్రత్తిపాడు: ప్రతి ఇంటికి తాగునీరు.. నిధులు మంజూరు

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. జగ్జీవన్ మిషన్ పథకం కింద నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో నూతన పైపులైన్లు నిర్మించి గ్రామీణ శివారు కాలనీలకు సురక్షితమైన తాగునీరు అందించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి, గుత్తేదారుడు పనులు చేపడితే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్