గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఉదయం తీవ్రంగా ఎండ మండిపోయి సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.