ప్రత్తిపాడు: 9 నుంచి మిర్చి యార్డుకు నెలరోజుల సెలవులు

ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మిర్చి యార్డుకు వేసవి సెలవులు ప్రకటించారు. నెల రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, కాపలా సిబ్బంది, కమీషన్ ఏజెంట్లు, ఎగుమతి సంఘాల ప్రతినిధులు యార్డు పాలకవర్గం, అధికారులను కోరారు. దీనిపై స్పందించిన యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రిక ఈ నెల 9 నుంచి జూన్ 6 వరకు మిర్చి క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, వ్యాపారులు కొంత ఇబ్బంది పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎండల తీవ్రత తగ్గితే ముందుగానే యార్డు తెరిచే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్