గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు శివారులో బుధవారం సాయంత్రం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4500 కేజీల రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరు సిఐ ఉత్తర్వులు మేరకు ఎస్ఐ డి బాబురావు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ఆటోను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాబురావు తెలిపారు.